Home వార్తలుఖమ్మం అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు వసూలు

అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు వసూలు

by VRM Media
0 comments

అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు వసూలు
26.07.2025 నాడు ఉదయం సమయంలో D. హరిత, సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, PS కల్లూరు కి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు కల్లూరు పట్టణములో మహమ్మద్ హబీబ్ @ వడ్డీల బాబా తండ్రి: బిక్కన్, 57 ఇయర్స్, ముస్లిం కులం, వృత్తి: ఆటో డ్రైవరు అను వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా, సామాన్య ప్రజల ఆర్ధిక అవసరాలను, అవకాశముగా మలుచుకుని, వారి యొక్క వాహనములని అక్రమముగా అధిక వడ్డీరేట్లకు (సుమారు 10 రూపాయలు) తాకట్టు పెట్టుకుని పీడిస్తున్నాడు అన్న మరియు ముందుగా మాట్లాడుకున్న నిబందనలు కూడా ఉల్లంఘించి మోసం చేయుచున్నాడు అన్న సమాచారం మేరకు, ఉన్నతాధికారుల ఆదేశములపై తనిఖీ చేయగా, అతడి ఇంటివద్ద 15 ద్విచక్ర వాహనములు, 4 కార్లు అన్నింటి విలువ 90,00,000-00 గల వాటిని జప్తు చేయనైనది. ఎవరైనా ఎటువంటి ప్రబుత్వ అనుమతులు లేకుండా అదిక వడ్డీ లకు తాకట్టు వ్యాపారములు చేయడం నేరం కాబట్టి సదరు మహమ్మద్ హబీబ్ @ వడ్డీల బాబా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనయినది. అలాగే ACP కల్లూరు గారు కల్లూరు మండలములో ఎవరైనా ప్రబుత్వ అనుమతులు లేకుండా అదికవడ్డీలకు తాకట్టు వ్యాపారములు చేయువారు ఉంటే సమాచారం ఇవ్వాలని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతాయి అని అట్టి సమాచారం ఇచ్చిన వారి వివరములు గోప్యముగా ఉంచబడుతాయి అని కల్లూరు ACP రఘు గారనలో కోరినారు.

VRM కల్లూరు మీడియా రిపోర్టర్ శ్రీనివాస్ రాథోడ్

2,812 Views

You may also like

Leave a Comment