


రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూలై 26
సారథ్యం పేరుతో రాష్ట్ర పర్యటన
పోతుగుంట రమేష్ నాయుడు
అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట లోని బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఈనెల 27 నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పర్యటన సారథ్యం పేరుతో తొలి గడప కడప నుండి ప్రారంభమవుతుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వికసిద్భారత్ లక్ష్యం కోసం సారదులుగా కార్యకర్తలను తీర్చిదిద్దేందుకు ఈ పర్యటన ఉంటుందని అలాగే ప్రతి గడపకు బిజెపి జెండాను మరియు అజెండాను తీసుకుపోయే కార్యక్రమం కార్యకర్తలను కారుణ్యముకులను చేయడానికి ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు రోజుకు ఒక జిల్లా చొప్పున పూర్తిస్థాయి పర్యటన చేస్తున్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భాను ప్రకాష్ రాజు బిజెపి మాజీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు ఒంటిమిట్ట చెరువు అధ్యక్షులు గంగిరెడ్డి బిజెపి నాయకులు వెంకటసుబ్బారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు