

కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 29
రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఉన్న 13.83 ఎకరాల ప్రభుత్వ భూములను, విజయవాడలో ఉన్న 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను బహుళజాతి సంస్థ అయిన లులు కు కట్టబెడడం తగదని ,విడుదల చేసిన 137 జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు.మంగ ళవారం కడపలో ని ఆ పార్టీ కార్యాలయంలో రామమో హన్ మాట్లాడారు.ప్రయివేట్ కంపెనీ అయిన లులు ను ప్రోత్సహించ డమంటే వేలాది మంది చిన్న వ్యాపారులను, లక్షలా ది మంది ఉపాధిని దెబ్బకొట్టడ మేనని విమర్శించారు.ఆర్టీసీ, ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడవ లసిన ప్రభు త్వమే వాటిని నాశనం చేయ టం తగదన్నారు.ఇందులో ఆ పార్టీ నేత చంద్రారెడ్డి పాల్గొన్నారు.