


కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ జూలై 29
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, నారా లోకేష్ కడప పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా కడప హజ్ హౌస్ ను వెంటనే పునః ప్రారంభించాలని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కోరారు.మంగ్లవారం కడప లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు, లోకేష్ లు మళ్లీ ఆ హామీని నెరవే ర్చాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిర్మితమై నప్పటికీ, గత వైసిపి ప్రభుత్వం లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు.మల్లీ టిడిపి ప్రభుత్వంలోనే కడప హజ్ హౌస్‌ను పూర్తి చేసి ప్రారంభించడ మే లక్ష్యమని చంద్రబాబు , లోకేష్ లు చెప్పారని సలావుద్దీన్ గుర్తు చేశారు.