Home ఆంధ్రప్రదేశ్ బదిలీ సిబ్బందిని ఘనంగా సత్కరించిన అండిబ సర్పంచ్. సత్యనారాయణ సర్పంచ్

బదిలీ సిబ్బందిని ఘనంగా సత్కరించిన అండిబ సర్పంచ్. సత్యనారాయణ సర్పంచ్

by VRM Media
0 comments

హుకుంపేట (అల్లూరి జిల్లా ) న్యూస్ :VRM Midea

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం అండిబ, భీమవరం ఉమ్మడి పంచాయతీల సచివాలయంలో విధులు నిర్వహిస్తూ బదిలీలపై వెళ్తున్న ఉద్యోగులకు నేడు అండిబ సర్పంచ్ తామర్ల సత్యనారాయణ, భీమవరం సర్పంచ్ నైని.సన్నిబాబు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సిబ్బందికి వీడ్కోలు పలుకుతూ పూలమాలలు వేసి దుస్సాలువా కప్పి ఘనంగా సన్మానించి,నూతనంగా వచ్చే సిబ్బందికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అండిబ సర్పంచ్ తామర్ల.సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుండి మంజూరైన పథకాలు మొదలు ప్రజలకు కావాల్సిన పనులన్ని సకాలంలో చేస్తూ ప్రజలకు సచివాలయ సిబ్బంది అందించిన సేవలు మరువలేనిదని ముఖ్యంగా ఈ సచివాలయంలో విధులు నిర్వహించిన సిబ్బంది బదిలీపై వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని వీళ్ళు బదిలీపై వెళ్లి మా నుండి దూరమైనప్పటికీ మా ప్రజలు మా గుండెల్లో జీవితాంతం గుర్తుండిపోతారని తెలియజేశారు.ఏది ఏమైనప్పటికి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి సంక్షేమ ఫలలు ప్రజలకు అందించటంలో కీలకపాత్ర పోషించారు అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.ఈ వీడ్కోలు కార్యక్రమంలో అండిబ సర్పంచ్ తామర్ల సత్యనారాయణతో పాటు భీమవరం సర్పంచ్ నైని.సన్ని బాబు, నైని మత్య రాజు వైస్ సర్పంచ్, వార్డ్ మెంబర్స్, అప్పారావు సెక్రటరీ, గోపి సెక్రటరీ,నైని సన్యాసిరావు ఫీల్డ్ అసిస్టెంట్,బుజ్జి బాబు ఫీల్డ్ అసిస్టెంట్,భూపతి వెల్ఫర్ అసిస్టెంట్, రామారావు డిజిటల్ అసిస్టెంట్, ఉదయ్ శ్రీ ఇంజనీరింగ్ అసిస్టెంట్,సింహాచలం సర్వేయర్, అచ్చిత హెల్త్ అసిస్టెంట్, జాన్సీ పోలీస్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.

2,821 Views

You may also like

Leave a Comment