Home వార్తలుఖమ్మం పరామర్శలు, ఆర్థిక సాయం…

పరామర్శలు, ఆర్థిక సాయం…

by VRM Media
0 comments

కల్లూరు మండలంలో మువ్వా పర్యటన

కల్లూరు ఆగస్టు03( VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్ )

టి జి ఐ డి సి చైర్మన్ మువ్వ విజయబాబు ఆదివారం కల్లూరు మండలంలో పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా కల్లూరు కు చేరుకున్న మువ్వ విజయ్ బాబుకు పొంగులేటి, మువ్వ ముఖ్య అనుచరుడు ఆర్యవైశ్య నాయకులు ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాటేపల్లి కిరణ్ కుమార్ తనయుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాటేపల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మధుర రోడ్డు కు చెందిన అద్దేపల్లి శ్రీనివాసరావు, పద్మ దంపతుల కుమారుడు, కోడలను (నూతన దంపతులు) ఆశీర్వదించి, నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు బహూకరించారు. ఎస్టీ కాలనీకి చెందిన బాలసాని వెంకటేశ్వరరావు ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. ఎస్టి కాలనీకి చెందిన సాయి, గంగ దంపతుల కుమారుడు వైద్యం వికటించి ఇటీవల మరణించగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం ముచ్చవరం గ్రామానికి చెందిన గంగవరపు సూర్య నారాయణ ఇటీవల మరణించగా ఆదివారం జరిగిన దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి కుమారుడు మాజీ సర్పంచ్ గంగవరపు శ్రీనివాసరావును పరామర్శించి ఓదార్చారు. మువ్వ వెంట కాటేపల్లి కిరణ్ కుమార్, మట్టూరు జనార్ధన్, రామిరెడ్డి, రాచబండి నాగేశ్వరావు, లక్ష్మారెడ్డి ,నాగిరెడ్డి,బాలసాని లక్ష్మణరావు, కృష్ణారెడ్డి, గిద్దె నాగరాజు, మొజ్జు తదితరులు పాల్గొన్నారు.

2,872 Views

You may also like

Leave a Comment