Home వార్తలుఖమ్మం ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మొబైల్ ల్యాబ్ వ్యాన్ ప్రారంభించిన పోలీస్ కమిషనర్

ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మొబైల్ ల్యాబ్ వ్యాన్ ప్రారంభించిన పోలీస్ కమిషనర్

by VRM Media
0 comments

ది. 04.08.2025

Vrm media ప్రతినిధి ఖమ్మం

నేర పరిశోధనలో కీలకంగా ఉపయోగపడే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మొబైల్ ల్యాబ్ వ్యాన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు.

నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి తక్షణమే పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఈ వాహనం పూర్తి సదుపాయాలతో కూడిన మొబైల్ ల్యాబ్ గా పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ అన్నారు.

నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి, ఆయా ప్రదేశంలో లభించిన అన్ని రకాల సాక్ష్యాలను (ఫింగర్‌ప్రింట్స్, రక్తపు నమూనాలు, ఇతర ఆధారాలు) సేకరించి, ప్రాథమిక విశ్లేషణలు చేసే ఈ వాహనం నేర పరిశోధనలో చాలా ముఖ్యమైనదని అన్నారు.

కార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, డాక్టర్ వి. నాగలక్ష్మి (శాస్త్రీయ అధికారి) కె. సుధాకర్ (శాస్త్రీయ అధికారి)కె. నరసింహ (అసిస్టెంట్ డైరెక్టర్)ఆర్ ఐ కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగులుమీరా, పాల్గొన్నారు. పి ఆర్ వో

2,846 Views

You may also like

Leave a Comment