
బుకింగ్ టికెట్లపై రేటును ముద్రించని నిర్వాహకులు మూడు సంవత్సరాల వయసు పిల్లలు నుండి పెద్దల వరకు ఎంట్రీ ఫీజు రూ 70 రంగులు మాయా లోకంతో ప్రజలను నిలువు దోపిడీ
రాజంపేట స్టాఫ్ రిపోర్టర్ రెడ్డి శేఖర్
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ రాజంపేట టౌన్ నందు పాత బస్ స్టాండ్ లొ నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. మూడు సంవత్సరాల వయసు పిల్లలు నుండి పెద్దల వరకు ఎంట్రీ ఫీజుతో నిలువు దోపిడీ చేస్తున్నట్లు ప్రజల నుండి బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. బుకింగ్ లో రూ 70 తీసుకొని టికెట్ ఇస్తున్నప్పటికీ దానిపై ధర ముద్రించక పోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజలు. దీనికి తోడు సంబంధిత ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ కు వెళ్లే ప్రజలకు ఎలాంటి రక్షణ లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.