Home వార్తలుఖమ్మం భార్య జ్ఞాపకార్ధం విద్యార్థులకు ప్లేట్స్ వితరణ

భార్య జ్ఞాపకార్ధం విద్యార్థులకు ప్లేట్స్ వితరణ

by VRM Media
0 comments

దాతల సహాయం అభినందనీయం

ఉపాధ్యాయులు గొల్లమందల వెంకటయ్య

కల్లూరు ఆగస్ట్04(VMR న్యూస్) :

మండల పరిధిలో చండ్రుపట్ల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గొల్లమందల వెంకటయ్య మాట్లాడుతూ దాతల సహాయము అభినందనీయమని అన్నారు. మోదుగు వెంకటరమణ జ్ఞాపకార్థంగా వారి భర్త మోదుగు గోవిందరావు మా పాఠశాల పిల్లలకు 50 మందికి ప్లేట్లు, గ్లాసులు ఇవ్వడం చాలా గొప్ప విషయమని అన్నారు. పాఠశాలలో పిల్లలకు అవసరమైన ప్రతి విషయంలో కూడా గ్రామములో ఉన్న ప్రతి ఒక్కరు స్పందించి సహాయ సహకా అందించాలని వారు కోరారు.అదే విధంగా గ్రామములో ఉన్న రెండు అంగన్వాడి సెంటర్లకు 50 ప్లేట్లు గ్లాసులు అందజేశారు.సుమారు 100 మంది చిన్నారులకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం సంతోషమని పలువురు గ్రామ ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగడుపు వెంకటేశ్వర్లు, ఇనపనూరి ముత్తయ్య, మాజీ వార్డు సభ్యులు ఇనుపనూరి జమలయ్య, మేస్త్రి పరిగడపు వెంకటేశ్వర్లు,గంధం చిరంజీవి, పరిగడుపు బాబు, పరిగడుపు మహేష్ ,వెంకటకృష్ణ, కాంపాటి కృష్ణ తరితరులు పాల్గొన్నారు.

2,869 Views

You may also like

Leave a Comment