Home ఆంధ్రప్రదేశ్ దామన పల్లి ఆశ్రమ జూనియర్ కళాశాలలో తక్షణమే లెక్చరర్స్ ను నియమించాలి.ఏపీ ఆదివాసీ జేఏసీ డిమాండ్.

దామన పల్లి ఆశ్రమ జూనియర్ కళాశాలలో తక్షణమే లెక్చరర్స్ ను నియమించాలి.ఏపీ ఆదివాసీ జేఏసీ డిమాండ్.

by VRM Media
0 comments

దేవీ పట్నం, ప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద్

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండల పరిధిలోని దామన పల్లి (ముసుళ్ళ కుంట) ఆశ్రమ జూనియర్ కళాశాలలో తక్షణమే లెక్చరర్స్ ను నియమించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కంగల శ్రీనివాసు మాట్లాడుతూ…దామన పల్లి ఆశ్రమ జూనియర్ కళాశాల బాలికలులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మొత్తం 62 మంది ఎంపీసీ,బైపిసి చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యి రెండు నెలలు కావస్తున్నా నేటికీ లెక్చరర్స్ ను నియమించలేదన్నారు.జూనియర్ కళాశాలలో కష్టతరమైన గ్రూప్ లలో ఎంపీసీ,బై,పి,సి చదువుతున్న విద్యార్థులకు లెక్షరర్స్ నియమించకపోవడంతో విద్యార్థినుల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందన్నారు.ఇప్పటికైనా రంపచోడవరం ఐటీడీఏ పీవో వారు,జిల్లా కలెక్టర్ వారు తక్షణమే స్పందించి ఆశ్రమ జూనియర్ కళాశాలలో లెక్చరర్స్ ను నియమించి విద్యార్థినులు భవిష్యత్ ను కాపాడాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకులు తెల్లం శేఖర్,యలగాడ నాగేశ్వరావు,పొడియం పండు దొర,డి.కనక దుర్గ,తుర్రం జగదీష్ దొర మొదలైన వారు పాల్గొన్నారు.

2,828 Views

You may also like

Leave a Comment