
కడప అర్బన్VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ మీ ఈశ్వర్ ఆగస్టు 6
శాప్ మాజీ డైరెక్టర్ డేనియల్ ప్రదీప్ కుమార్
కడప అర్బన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్ పి టి సి అభ్యర్థులను అత్యధిక మెజా రిటీతో గెలిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాప్ మాజీ డైరెక్టర్ ఎం డేనియల్ ప్రదీప్ కుమార్ కోరారు బుధవారం ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు.వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో కుట్ర చేసి గెలవడానికి కొంత మంది ప్రయత్నం చేస్తున్నారని అయితే ఓటర్లు మాత్రం కూటమి నాయకు లకు తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.వైఎస్ కుటుంబం పులివెందుల ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో పులివెందుల ప్రజలకు బాగా తెలుస న్నారు.కూ టమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేక అపద్దాలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.మాట తప్పని,మడమ తిప్పని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడుగా ఏపి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ న్ రెడ్డి కూడా గతంలో అనేక సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు.పులివెందుల జడ్ పి టి సి అభ్యర్థిని గెలిపించి వైఎస్ జగన్ మల్లీ అధికారంలోకి వచ్చేందుకు ఈ ఎన్నికల నుంచి శ్రీకారం చుట్టాలని కోరారు.ఈ ఉప ఎన్నికలు కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు, నీతికి నిజాయితీకి కట్టుబడే ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జరిగే పోటీగా డేనియల్ ప్రదీప్ అభివర్ణిం చారు.తాము కూడా పులివెందు లలో పర్యటించి తమ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు.