Home ఆంధ్రప్రదేశ్ ఇందుకూరుపేటలో జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు విజయవంతం చేద్దాం.తహసిల్దార్ కె.సత్యనారాయణ.

ఇందుకూరుపేటలో జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు విజయవంతం చేద్దాం.తహసిల్దార్ కె.సత్యనారాయణ.

by VRM Media
0 comments

దేవీపట్నం ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలోని స్త్రీ శక్తి భవనంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలు ఏర్పాటుచేయ్యటం జరిగింది.కావున దేవీపట్నం మండలంలో ఉన్న ఆదివాసీ ఉద్యోగులు,ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివాసి సంఘాల నాయకులు,ఆదివాసి ప్రజా సంఘాల నాయకులు,ఆదివాసి ప్రజా ప్రతినిధులు,మహిళలు,యువతీ యువకులు మొదలైన ఆదివాసి పెద్దలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవీపట్నం తహసిల్దార్ కె.సత్యనారాయణ,దేవీపట్నం సాల్మన్ రాజు,ఏవో వెంకట్రావు ఈరోజు జరిగిన ముందస్తు సమావేశంలో తెలియజేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ కె.సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఇందుకూరుపేటలోని స్త్రీ శక్తి భవనం నందు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుందన్నారు. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ కోసం ప్రభుత్వం వారు అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున దేవీపట్నం మండలంలో ఉన్న ఆదివాసి ఉద్యోగులు,ఉద్యోగ సంఘాల నాయకులు,యువతీ యువకులు,మహిళలు,ఆదివాసి ప్రజా ప్రతినిధులు మొదలైన ఆదివాసి పెద్దలందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నామన్నారు.ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా రావలసిందిగా కోరుతున్నామన్నారు

ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ నాయకులు తెల్లం శేఖర్, కారం రామన్న దొర,కలుం సూర్య ప్రకాష్,మడి మురళి,పండా ఏడుకొండల దొర,మడకం బంగారు బాబు,అరగాటి వీరభద్రారెడ్డి,మరియు ఆదివాసి ఉద్యోగులు మొదలైనవారు పాల్గొన్నారు.

2,849 Views

You may also like

Leave a Comment