Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్టలో కూటమి గర్జన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఘన సన్మానం, ఇంటింటికీ టీడీపీ సంక్షేమ సందేశం

ఒంటిమిట్టలో కూటమి గర్జన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఘన సన్మానం, ఇంటింటికీ టీడీపీ సంక్షేమ సందేశం

by VRM Media
0 comments

ఒంటిమిట్ట VRM న్యూస్ మౌలాలి ఆగస్టు 8

వార్తా వివరాలు:
ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. హరిత హోటల్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు, పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి ఘనంగా సన్మానించారు.
సన్మానం అనంతరం వారు కూడా గ్రామాల వారీగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానికులు టీడీపీకి తమ మద్దతు తెలుపుతూ హరతులు ఇచ్చి, జేజేలు పలికారు.
ఈ ప్రచారంలో టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, బీసీ సెల్ వెంకటనరసయ్య, రమణయ్య, రామ్ మోహన్, సుబ్బనరసయ్య నాయుడు, రామ చంద్రయ్య, రామ్ మోహం నాయుడు, జగన్ మోహన్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొన్నారు.

2,847 Views

You may also like

Leave a Comment