
ఒంటిమిట్టVRM న్యూస్ ఆగస్టు 9
, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్ మోహన్ రాజు గారు ముమ్మర ప్రచారం
వార్తా వివరాలు:
ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో,మంత్రివర్యులు శ్రీ ఫారూఖ్ గారు, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారి నెతృత్వంలో విస్తృత స్థాయిలో ప్రచార యాత్ర కొనసాగుతోంది.
ఈ సందర్భంగా 11వ బూత్ పరిధిలో మైనారిటీ మంత్రివర్యులు శ్రీ ఫారూఖ్ గారు, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, హరి ప్రసాద్ గారు పాల్గొని, ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. “పెన్షన్ అందుతున్నదా?”, “తల్లికి వందనం పథకం లబ్ధి పొందారా?” వంటి ప్రశ్నలతో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ, కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ ప్రచారంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, 11వ బూత్ కన్వీనర్ సుబ్బరాయుడు, కరెంటు రమణ, రవి నాయుడు గారు, సుబ్బనరసయ్య తదితరులు చురుకుగా పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి విజయం కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై పనిచేస్తున్నారు.