
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జి రవిబాబు ఆగస్టు 9
గౌరవనీయులు కడప జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీమతి సబితమ్మ కి, రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండల పరిధిలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు చేసుకున్న విజ్ఞప్తి,
నమస్తే మేడం, సిద్ధవటం మార్కెటింగ్ కమిటీ పరిధిలో ఒంటిమిట్ట ,సిద్ధవటం ,అట్లూరు మండలాలు ఉన్నాయి. సిద్ధవటం మార్కెటింగ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటివరకు ఒంటిమిట్ట మండలానికి చెందినవారికి ఒక్కసారి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రస్తుతము ఈ పదవిని బీసీ మహిళలకు కేటాయించడం జరిగింది. ఒంటిమిట్ట మండలంలో గడచిన 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న మండల కేంద్రమైన ఒంటిమిట్ట మాజీ ఎంపిటిసి, రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి ఓబినేని సుబ్బమ్మకు ఈ పర్యాయము మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కేటాయించాలని తమరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళగా ఉండి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొంటూ, ఆందోళన కార్యక్రమాల్లో సైతం ముందు వరుసలో ఉంటూ తన గళాన్ని వినిపించే, శ్రీమతి ఓబునేని సుబ్బమ్మకు చైర్మన్ పదవి కేటాయించి తమరు న్యాయం చేదురని కోరుకుంటున్నాం. కాగా ఈ పదవికి పార్టీ మారిన వ్యక్తులకు కేటాయించాలని కొందరు ప్రయత్నించడం సిన్సియర్గా పనిచేస్తున్న వారిని అవమానించడమేనని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం సిద్ధవటం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ మహిళ కేటాయించారు, కనుక ఒక పర్యాయం ఒంటిమిట్ట మండలానికి చెందిన శ్రీమతి ఓబినేని సుబ్బమ్మకు ఆ పదవిని కేటాయించి, ఒంటిమిట్ట మండలానికి చెందిన వారికి ఈ మారు న్యాయం చేదురని పార్టీ ఆవిర్భవం నుంచి ఉంటున్న నాయకులుగా సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము.
నమస్కారములతో, మీ ఓబినేని సుబ్బమ్మ.