

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఈశ్వర్ ఆగస్టు 10:
మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీత రచనతో చిరయశస్సును సంపాదిం చిన సుందరకవి శంకరం బాడి సుందరా చారి అని సి.పి.బ్రౌన్ భాషా పరిశో ధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.చింతకుంట శివా రెడ్డి పేర్కొ న్నారు. యోగి వేమన విశ్వవిద్యా లయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆదివారం సాయంత్రం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో ప్రసన్నకవి శంకరం బాడి సుందరాచారి 112వ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముందుగా పరిశో ధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి శంకరంబాడి సుందరాచారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమం లో సూర్య చారిట బుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎం.ప్రభాకర్, పాఠకులు జయ ప్రసాద్, రంగ, చరణ్ కుమా ర్, చంద్రశేఖరరెడ్డి, వెంకటరమణ, పేట మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.