Home ఆంధ్రప్రదేశ్ భజన పుల్లయ్య మరణం కళారంగానికి తీరని లోటు:ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి

భజన పుల్లయ్య మరణం కళారంగానికి తీరని లోటు:ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి

by VRM Media
0 comments

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 12:

కడప చెక్కభజన, కులుకు భజన, జడకోపు,కోలా టాల్లో అ త్యంత నిపుణులుగా ప్రసిద్ధి చెందిన సగిలి పుల్లయ్య మరణం కళాకా రులకు తీరని లోటని యోగివేమన విశ్వవిద్యా లయం పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లి కార్జున రెడ్డి అన్నారు. కడప సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం లో వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇటీవల మరణించిన చెక్కభజన కళాకారుడు పుల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివా ళులు అర్పించారు. మల్లికా ర్జున రెడ్డి మాట్లాడుతూ కలసపాడు మండలం, లింగారెడ్డి పల్లె హృదయ పేటలో 1959లో పుల్లమ్మ, ఓబ య్య దంపతులకు జన్మించిన పుల్లయ్య కేవలం 16 సంవత్సరాల వయస్సులోని చెక్కభజనలో తర్ఫీ దు పొంది గురువుగా మారారని, ఆయన దగ్గర విద్య నేర్చుకున్న 40 మందికి పైగా శిష్యులు గురువు లుగా తయారై వేలాది మందికి చెక్కభజన నేర్పు తున్నారని అన్నారు.సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాల కులు ఆచార్య జి పార్వతి ప్రసం గిస్తూ గణతంత్ర దినోత్సవ వేడు కల్లో ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయ్, మరొక సందర్భంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎదురుగా చెక్క భజన ప్రదర్శించి వారితో మెప్పు పొందారని చెప్పారు

2,839 Views

You may also like

Leave a Comment