జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల అభ్యర్థి మారెడ్డి. లతారెడ్డి, ఒంటిమిట్ట అభ్యర్థి అద్దులూరి. ముద్దుకృష్ణ రెడ్డి అఖండమెజార్టీతో గెలిచి నందుకు నరవకాటిపల్లి, అరుంధతికాలనీలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచాకాల్చినారు.కేకు కోసి ఒకరికిఒకరు తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు పాల్గొన్నారు అందరి సమిష్టికృషితో గెలుపును అందుకున్నామని నరవకాటిపల్లి అరుంధతికాలనీ నాయకులను అభినందించారు. సీనియర్ నాయకులు ఎస్. గఫార్ రహిమాన్ మాట్లాడుతూ న్యాయం, ధర్మం గెలిచిందని, ఈ గెలుపు పార్టీకి అంకితం అన్నారు. ఈకార్యక్రమంలో మండలతెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి. రాయుడు, తెలుగుదేశం నాయకులు చిన్నవెంకటరెడ్డి,నరవకాటిపల్లి తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు పిచ్చయ్య, ఉపాధ్యషులు ఎం. రవిశంకర్, మాజీ ఉప సర్పంచ్ బి. నాగరాజు, మాజీ ఎం.పి.టి.సి. వి. నరసింహ, మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. గఫార్ రహిమాన్, ఎస్సి సెల్ సభ్యులు ఎం. పెద్దసుబ్బయ్య, వి.వెంకటసుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజాయాదవ్, మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకుడు రాజా రెడ్డి, జనసేన పార్టీ యువ నాయకుడు వి. సురేష్ కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
