Home ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే రాజీలేని పోరాటాలు 69 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేదలకు అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ

జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే రాజీలేని పోరాటాలు 69 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేదలకు అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ

by VRM Media
0 comments


నందలూరు స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిశేఖరబాబు

రాజంపేట జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే రాజీలేని పోరాటాలను కొనసాగిస్తోందని ఏపీయూడబ్ల్యూజే అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ అన్నారు ఆదివారం ఏపీయూడబ్ల్యూజే 69 వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పట్టణ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్, అమ్మవారి శాల, ఆంజనేయస్వామి ఆలయం, పాత బస్టాండ్ కూడలిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు అల్పాహార ప్యాకెట్లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ పని చేస్తోందన్నారు.ప్రతి సంవత్సరం ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఆకలితో ఉన్నటువంటి నిరుపేదలకు అల్పాహారం ప్యాకెట్లు అందజేయడం జరిగిందన్నారు. గడిచిన 68 వసంతాలల్లో జర్నలిస్టుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేసిన ఘనత ఏపీయూడబ్ల్యూజేకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద యూనియన్ గా అవతరించి, అత్యధిక జర్నలిస్టుల సభ్యత్వం కలిగిన ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే అన్నారు. రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీయూడబ్ల్యూజే పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, అధ్యక్షులు మలిశెట్టి సుబ్బ నరసయ్య, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి ఉదయగిరి కళ్యాణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మండ్ల శ్రీహరి,చామంచి వెంకటసుబ్బయ్య, కొమ్మ రెడ్డిశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు.

2,918 Views

You may also like

Leave a Comment