



Vrm media ప్రతినిధి ఖమ్మం
వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంటెస్టులో స్థానిక ఫోటోగ్రాఫర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు.
ఈ పోటీలో నాగేంద్రబాబు (కార్తీక్) తన సృజనాత్మకతను ప్రతిబింబించే ఫోటోలతో ప్రత్యేకంగా ఆకట్టుకుని బెస్ట్ ఇమేజ్ అవార్డుని గెలుచుకున్నారు. అదేవిధంగా వెడ్డింగ్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సాధించారు. అలాగే కన్సల్టేషన్ సెక్షన్‌లో మూడు బహుమతులు సాధించి జిల్లా ప్రతిష్ఠను నిలబెట్టారు.
ఈ సందర్భంగా జిల్లా మేయర్ నీరజ గారు, కుమార్తపు మురళి గారు, జిల్లా అధ్యక్షుడు వెంకట గారు, మాజీ అధ్యక్షుడు దేవర నాగరాజు గారు, పటాన్ హుస్సేన్ గారు విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, నాగేంద్రబాబు విజయం జిల్లా యువతకు ప్రేరణగా నిలుస్తుందని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ ఖచ్చితంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆకాంక్షించారు.
వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నిర్వహించిన ఈ పోటీ, జిల్లా యువత ప్రతిభను వెలికితీయడమే కాక, వారిని ప్రోత్సహించే వేదికగా నిలిచిందని వారు తెలిపారు.