VRM MEDIA ప్రతినిధి ఖమ్మం
గిరిజన చిత్రాలకు ఎన్నో బహుమతులు
అడవితోనే జీవనం, ప్రత్యేకమైన వస్త్రధారణ, అటవీ సంపద, పోడు వ్యవసాయం జీవనాధారంగా మానవ జాతికి అనవాళ్లుగా ఆదివాసీలు, గిరిజనులు జీవనం సాగి స్తున్నారు. అమాయకత్వమే వారి అభరణం.. మూగ జీవా లు వారి నేస్తాలుగా ఇంకా అనేక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేక జీవనం సాగిస్తున్నారు. అడవుల్లో వాగులు, కొండలు, పచ్చని ప్రకృతి ఒడిలో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను వీడకుం డా జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనుల బతుకు చిత్రా లను తన కెమెరాలో బంధించిన ఖమ్మం చెందిన ఇనపాల శివకుమార్ ఫోటోగ్రఫీలో జాతీయస్థాయిలో ఎన్నో బహుమతులు రావడం జరిగింది అదే విధంగా జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఆయ రాష్ట్రాల సంప్రదాయాల గిరిజన తెగలు వారి యొక్క జీవన విధానంపై వారి యొక్క ఆహార అలవాటు పై ప్రయాణిస్తూ ఫోటోలను బంధించడం జరిగింది
ఫోటోగ్రాఫర్ రంగంలో 2006లో గ్రేస్ వీడియో మిక్సింగ్ యూనిట్ ఎడిటింగ్ చేయడం ప్రారంభించడం జరిగింది కాలప్రమైన ఫోటోగ్రఫీ రంగంలోకి రావడం జరిగింది ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పఠాన్ హుస్సేన్ ఖాన్ 2021లో అరకులో వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ వర్క్ షాప్ లో వారి ఫొటోస్ కి ఆకర్షితులై ఆర్ట్ ఫోటోగ్రఫీలో రాణించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇటీవల కాలంలో జాతీయస్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హానర్ (AFIP) కూడా తీసుకోవడం జరిగింది


