Home ఆంధ్రప్రదేశ్ మనుషులను ఆవిష్కరించిన పుస్తకం “ఆయుధం లాంటి మనిషి”:ప్రముఖ విమర్శకులు మేడిపల్లి రవికుమార్

మనుషులను ఆవిష్కరించిన పుస్తకం “ఆయుధం లాంటి మనిషి”:ప్రముఖ విమర్శకులు మేడిపల్లి రవికుమార్

by VRM Media
0 comments

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 21:

ఏ ఎస్ పి లోసారి సుధాకర్ కవిత్వం మనుషులను ఆవిష్కరించి, సంస్కరించిన కవిత్వమని ” ఆయుధం లాంటి మనిషి” పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు ఆచార్య మేడిపల్లి రవికు మార్ పేర్కొన్నా రు.బుధవారం సీపి బ్రౌన్ గ్రంథాల యంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడిపల్లి హాజర య్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ వైపు చూస్తే తప్ప అమ్మ రుణం తీర్చుకోలేవురా అని ఆయన కవిత్వం లో ప్రశ్నిస్తా రని చెప్పారు.అంబేద్కర్ మిషన్ చైర్మన్ ప్రముఖ అడ్వకేట్ సంపత్ కుమార్ మాట్లాడుతూ సుధాకర్ కవిత్వం సమాజంలో మార్పు తెచ్చే అక్షర ఆయుధాలని చెప్పారు.గౌరవ అతిథి వైవీ యూ తెలుగు శాఖ ఆచార్య ఎన్ ఈశ్వర రెడ్డి మాట్లాడుతూ మనుషులలో చైతన్యం పెంపొందించడానికి లోసా రి కవిత్వం చాలా ఉపయో గపడు తుందని చెప్పారు ఈ కార్య క్రమం లో సిపి బ్రౌన్ కేంద్రం సంచాల కులు జి పార్వతి, సి హెచ్ శివారెడ్డి కేంగర మోహన్, విజయ్ కుమార్ స్వామి,అనిల్ కుమార్ లెనిన్ ప్రసా ద్,రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

2,899 Views

You may also like

Leave a Comment