Home ఆంధ్రప్రదేశ్ ఇస్దిమా సమావేశానికి ముస్లిం సోదరులు హాజరుకావాలి-జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్టు అధ్యక్షుడు ఖారీ అబ్దుల్ సుభాన్

ఇస్దిమా సమావేశానికి ముస్లిం సోదరులు హాజరుకావాలి-జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్టు అధ్యక్షుడు ఖారీ అబ్దుల్ సుభాన్

by VRM Media
0 comments

ఒంటిమిట్ట VRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 23

ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి సమీపంలో ఉన్న మదరసా నందు సెప్టెంబర్ 28,29 తేదీలలో జరుగు ఇస్దిమా సమావేశానికి ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్టు అధ్యక్షుడు ఖారీ అబ్దుల్ సుభాన్ పిలుపునిచ్చారు.శనివారం నిరుపేదలకు,ఇమామ్లు, మౌజన్లకు కుల మతాలకు అతీతంగా ఆయన పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదరసా నందు సెప్టెంబర్ నెల 28,29 తేదీలలో ఇస్తిమా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ ఇస్తిమా కార్యక్రమానికి కడప జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్,ఢిల్లీ నుంచి మత పెద్దలు హాజరవుతారన్నారు.
ఈ సమావేశానికి జమాతీలు కూడా పాల్గొంటారన్నారు.జమాతీల ముఖ్య ఉద్దేశం ప్రజలకు సేవ చేయడం దైవ మార్గంలో నడుస్తూ వారి సొంత డబ్బుతో తమ విలువైన సమయాన్ని కేటాయించి గ్రామ గ్రామానికి తిరిగి ప్రజలకు సేవలందిస్తారన్నారు ఏ గ్రామంలో అయితే ముస్లిం సోదరులు ఉండి మసీదు లేనిచో అక్కడ మసీదు ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు.

2,907 Views

You may also like

Leave a Comment