Home ఆంధ్రప్రదేశ్ లోకేష్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మొక్కల నాటకం

లోకేష్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మొక్కల నాటకం

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 28

రాజంపేట రూరల్,
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా, పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా మొక్కల నాటకం కార్యక్రమం ఘనంగా జరిగింది.
రాజంపేట ఇన్‌చార్జ్ జగన్ మోహన్ రాజు నాయకత్వంలో, టక్కోలు గ్రామ పంచాయతీ పరిధిలోని డంపింగ్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకుడు చిన్నపరెడ్డి, కార్యకర్తలు సుబ్బారాయుడు, శివ, రమణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, పచ్చదనం పెంపొందించడమే భవిష్యత్ తరాలకు అందించే నిజమైన బహుమతి అని పేర్కొన్నారు.

2,851 Views

You may also like

Leave a Comment