
కాగజ్నగర్, ఆగస్టు 30:
VRM meadia news ప్రతి నిది
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
పిల్లలు కలగడం లేదని మనస్థాపంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మిరుదొడ్డి కవిత ఆత్మహత్య…?? ఈమె ప్రస్తుతం కౌటాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా సేవలు అందిస్తున్నారు.
ఆమె భర్త జియో ఆఫీసు లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం వీరు కాగ జ్ నగర్ పట్టణం లోని ఎల్లా గౌడ్ తోట ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంక్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కాగజ్నగర్ పట్టణంలోని యెల్ల గౌడ్ తోటలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్‌బాడీనీ శుక్రవారం రాత్రి భద్రపరిచారు. ఆత్మహత్యకు గల పూర్తి సమాచారం తెలుయాల్సి ఉంది. వారి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు పిల్లలు కలగడం లేదని అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రాంతంలో వారి తల్లి గారి ఇంటి దగ్గర మొన్ననే గణేష్ విగ్రహాన్ని ఆమె తన సొంత డబ్బులతో స్పాన్సర్ చేశారు. ఈరోజు కూడా ఆ గణనాధునికి ప్రసాదాన్ని తమ ఇంటి నుండి వండి పంపించినట్టు వారి కుటుంబీకులు, స్థానికులు తెలిపారు. ఎంతో మంచిగా అందరితో కలిసి మెలిసి కలివిడిగా తిరిగే కవిత మా మధ్యలో లేకపోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నామని వారి కుటుంబీకులు, స్థానికులు శోకతప్త హృదయంతో తెలిపారు.