


VRM న్యూస్ ఒంటిమిట్ట బాల మౌలాలి ఆగస్టు 31
ఒంటిమిట్ట వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం హరిజనవాడలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు ఉట్టి కొట్టు కార్యక్రమమును యువకులందరూ కలిసి ఉత్సాహవంతముగా నిర్వహించుకున్నారు. వాడలోని మహిళలు పెద్దలు యువకులు పిల్లలు అందరూ కలిసి సంతోషముగా ఆటపాటలతో కల్మషం లేని మనసుతో సంబరాలు జరుపుకున్నారు. ఉట్టి కొట్టుటలో యువకులు ఒకరు మార్చి ఒకరు పాల్గొనడం ఉట్టిని సరైన మార్గంలో కొట్టలేకపోవడం చూస్తున్న వినాయక భక్తులందరూ ఆహ్లాదకరంగా నవ్వుకోవడం వాడ అంతా సంబరంతో మునిగిపోయినట్టు ఉన్నది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమంలో యువతులు కూడా ఉత్సాహభరితంగా పాల్గొని సంబరాలను సంబరంగా ఉత్సాహంగా ఆనందభరితంగా ఆనందించారు. వినాయక చవితి విగ్రహ మండపం ఏర్పాటు కమిటీ వారు తెలియజేయడమేమనగా ఐదవ రోజు నుంచి ప్రతిరోజు యువతీ యువకులకు వాడలోని ప్రజలకు వయసుతో సంబంధం లేకుండా వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహిస్తూ ఉంటామని గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలియజేశారు.