Home వార్తలుఖమ్మం పందిళ్లపల్లి గ్రామంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

పందిళ్లపల్లి గ్రామంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి ఖమ్మం

ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలను మంగళవారం పందిళ్లపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, జగనన్న అభిమానులు దేవరపల్లి రవికుమార్ రెడ్డి, ఇనుకాళ్ళ – అనంతరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం YSR @ జగనన్న మరియు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఇనుకుళ్ళ సూరారెడ్డి, కొండపు రెడ్డి రవీందర్ రెడ్డి లింగం రాంబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంక్షేమ రాజ్యాన్ని అందించిన ఘనత నాటి వైఎస్ఆర్ కే దక్కుతుందన్నారు. నిరుపేదల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల కోసం రుణమాఫి కిలో 1 రూపాయుకే బియ్యం ఉచిత విద్యుత్, 108, 104 సేవలు జలయజ్ఞం అందించిన మహనీయుడు వైయస్సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆనం ప్రబాకర్ రెడ్డి, ఆనం నరేష్, ఇనుకుళ్ల సీతరాంరెడ్డి,
మండే రాములు, వాకా వీరారెడ్డి, నెంబర్ వెంకటేశ్వర్లు, వాకా కనకారెడ్డి,ఇనుకుళ్ళ సీతారాం రెడ్డి, చల్లా వెంకటేశ్వర రెడ్డి, ఎనుముల తిరుపతి రెడ్డి,రెడ్డిమల్ల వెంకటేశ్వర రెడ్డి, ఇనుకుళ్ల బ్రహ్మ రెడ్డి, మండె శీనివాసరావు,దేవరపల్లి సుధాకర్ రెడ్డి, ఆనం లచ్చి రెడ్డి,సైదారెడ్డి, చల్లా వెంకటరెడ్డి, చల్లా భద్రారెడ్డి, అలవాల జనార్దన్ మాజి MPTC ఓర్సు వీరభద్రం గ్రామ Ysr జగనన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

2,853 Views

You may also like

Leave a Comment