విలేకరి మృతికి సంతాపం. కల్లూరు లోని వేము మోహన్ బాబు( 39 )అకాల మృతికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య పలు దిన పత్రికల, ఎలక్ట్రాన్ మీడియా విలేకరులు తహసిల్దార్ పులి సాంబశివుడు ఎస్సై హరిత మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజా దేవి పలు పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజాసంఘాల నాయకులు తో పాటు ఆయా గ్రామాలలోని ప్రజలందరూ భౌతిక దేహమును సందర్శించి నివాళులర్పించారు. మండలంలో మీడియా మిత్రులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి విలేకరిగా ఉంటూ గ్రామాలలో ఉన్న సమస్యలను వెలుగుటీసి ప్రజా సమస్యల పరిష్కారంలో కలం రంగంలో అనేకమందికి సహకరించారని అనేక సేవలను చేశారని ఆయన సేవలను నల్ల బ్యాడ్జీలు ధరించి పూలమాలను వేసి జోహార్, జోహార్ అంటూ నివాళులర్పించారు. అతి తక్కువ కాలం మరియు తక్కువ వయసులో అందరి ఆదరాభిమానాలను పొందిన విలేకరి అని కొనియాడుతూ నివాళులర్పించారు. వారి కుటుంబానికి ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చారు. ప్రజాపక్షం న్యూస్ కల్లూరు.

2,839 Views

You may also like

Leave a Comment