
కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 03:
కడప జిల్లాకు పూర్వం జిల్లా కేంద్రంగా వెలుగొందిన సిద్ధవటం కోట చరిత్ర ఎంతో గొప్పదని ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ కోట ఉత్సవాలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణ భారత పర్యా టక సంస్థ గౌరవ అధ్యక్షులు.భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విద్వాన్ డా గానుగ పెంట హనుమంత రావు అధికారులను కోరారు.బుధవారం కడపలోని కవయిత్రి మొల్ల సాహితీ పీఠం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక పితామహుడు సంస్థ వ్యవ స్థాపకులు సిద్ధవటం సీతారా మయ్య ఆశయాల సాధనకు సంస్థ పని చేస్తుందని చెప్పారు.సిద్దులు, ఋషులు , యోగుల ఆవాసమైన సిద్ధవటం తాలూకా ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడ లేనన్ని శివాల యాలు, ప్రాచీన దేవాలయాలు, శాసనాలు, శిల్ప సంపద ఉంద న్నారు,8 వ శతాబ్దానికి చెందిన ఈ సిద్ధవటం కోటను ఉదయగిరి సామంత రాజులు, మట్లి రాజులు నవాబులు ఆంగ్లేయులు పాలిం చారని చెప్పారు.ఇందులో బాగంగా అతి ప్రాచీనమైన జ్యోతి సిద్దేశ్వర దేవాలయాలు, నిత్య పూజయ్య స్వామి కోన,కపిల తీర్థం, వనే శ్వరం.రాష్టకూట చక్రవర్తులు నిర్మించిన మాచుపల్లె రేణుకా ఎల్లమాంబ దేవాలయాలు ఉన్నాయని చెప్పారు.కాబట్టి ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో మౌలిక సదుపా యాల తో పాటు శిలా ఫలకం దశలోనే నిలిచి పోయిన మాచుపల్లె ఖాదర్ బంగ్లా బ్రిడ్జి నిర్మాణం,టక్కోలి పొన్నవోలు మధ్య పెన్నానది పై బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇందులో బాగంగా పర్యాటక ప్రదేశాలను వెలుగులోకి తెచ్చేందుకు జిల్లాలోని కళాకారులను ఏకం చేసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.ఆసక్తి గల వారు తమకు దగ్గరలో ఉన్న ప్రాచీన పర్యాటక ప్రదేశాల వద్ద ప్రదర్శన చేసి ఎంట్రీలను పంపాలని సూచించారు ఇందులో ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జ్యోతి జార్జి,ప్రధాన కార్యదర్శి పాకనాటి శ్రీనివాసులు పాల్గొన్నారు