Vrm media ఖమ్మం ప్రతినిధి

ఈ నెల 6న గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం వున్న నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 6 (శనివారం) మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 6 ఉదయం 6:00 గంటల నుండి సెప్టెంబర్ 7 ఉదయం 6:00 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు (మద్యం దుకాణాలు) మద్యం సరఫరా చేసే బార్ & రెస్టారెంట్లు, క్లబ్లు, హోటళ్ళు మూసివేయాలని ఆదేశించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పి ఆర్ వో
Vrm media ఖమ్మం ప్రతినిధి
సెప్టెంబర్ 6న మద్యం దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు బంద్ : పోలీస్ కమిషనర్ సునీల్ దత్