Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట టిడిపి మండల నాయకుల ఆగ్రహం – వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డికి ఓపెన్ చాలెంజ్

ఒంటిమిట్ట టిడిపి మండల నాయకుల ఆగ్రహం – వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డికి ఓపెన్ చాలెంజ్

by VRM Media
0 comments

ఒంటిమిట్టVRM న్యూస్ రిపోర్టర్ మౌలాలి సెప్టెంబర్ 5

ఒంటిమిట్ట మండలంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైయస్సార్సీపి నాయకుడు సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు అనవసర ఆరోపణలతో నిండినవిగా ఉన్నాయని, ఆయన అబద్ధపు ప్రచారానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగబోమని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు స్పష్టం చేశారు.
నిన్న ప్రెస్‌మీట్‌లో సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఒంటిమిట్ట మండలంలో 12 మంది సర్పంచుల చెక్ పవర్ రద్దు చేశారని, దీనిపై టిడిపి నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మండల టిడిపి నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి అబద్ధపు మాటలు ప్రజలు ఇక భరించరని , తప్పు చేసిన వారి శిక్ష అనుభవించక తప్పదని, తప్పు చేశారు కాబట్టి చెక్ పవర్ రద్దు చేశారని హెచ్చరించారు.
“రామాలయంలో ప్రమాణం చేస్తావా?” – టిడిపి సవాల్
టిడిపి నాయకులు ఇరగంరెడ్డిసుబ్బారెడ్డిని నేరుగా సవాలు చేశారు.
“అయ్యా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి… నీ గురించి మండలంలో తెలియని వారు లేరు. నువ్వు ప్రతిరోజూ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామిని ‘మా రాముడు డేంజర్ మోస్ట్’ అని సంబోధిస్తూ ఉంటావు. అయితే, సర్పంచుల రద్దులో టిడిపి ప్రమేయం ఉందని చెబుతున్నావు కాబట్టి, ఆ రామాలయ సమక్షంలో ప్రమాణం చేయగలవా? ప్రతినిత్యం వెళ్లే రామాలయ ప్రాంగణంలో ప్రజల ముందే నీ మాటలు నిజమని ధైర్యంగా ప్రమాణం చేయి” అని టిడిపి వర్గాలు ఘాటుగా ప్రశ్నించాయి.
టిటిడి స్థలాల కబ్జా – అబ్బిరెడ్డి అంశం బహిర్గతం
టిడిపి నాయకులు మరో సవాల్ విసిరారు.
“టిటిడి వారు స్థలాన్ని శుభ్రం చేస్తే, ఆ స్థలంపై అక్రమ కట్టడాలు కట్టింది ఎవరు? టీటీడీ ఆస్తులపై కబ్జా చేసినవారు ఎవరు? మామిడి అబ్బిరెడ్డి & ఇతర వైసీపీ వర్గాలే ఈ అక్రమాలకు పాల్పడ్డారని ప్రజలకు తెలుసు. అలాంటి విషయాల్లో మీ పార్టీకి సంబంధం లేకుండా కూటమి నాయకులపై ఆరోపణలు చేయడం నీ అలవాటు. ఈ పద్ధతి కొనసాగితే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి” అని మండిపడ్డారు.
“రెండు పార్టీలు కలిసి అక్రమాలను తొలగిద్దాం” – టిడిపి సవాల్
ఒంటిమిట్ట టిడిపి నాయకులు మరింత దూకుడుగా స్పందిస్తూ, సుబ్బారెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.
“మా పార్టీ ఎప్పుడైనా అవినీతి లేదా అక్రమాలకు పాల్పడిందని నీకు నమ్మకం ఉంటే, ఒకసారి కలిసి కూర్చుదాం. మీ వైసీపీ తరఫున నలుగురు నాయకులు రండి, మా టిడిపి తరఫున మేము వస్తాం. ఎవరు ఎక్కడ భూకబ్జాలు చేశారో, ఎవరు అక్రమ కట్టడాలు కట్టారో స్వచ్ఛందంగా పరిశీలించి, ఇద్దరు కలిసి వాటిని తొలగిద్దాం. ఎవరైనా మా పార్టీ వ్యక్తులు కూడా అక్రమాలకు పాల్పడి ఉంటే, వారిని కూడా వెనుకాడకుండా తొలగిస్తాం. మీరు కూడా అదే ధైర్యం చూపగలరా? ప్రజల ముందే ఈ సవాల్ అంగీకరించండి” అని టిడిపి నాయకులు స్పష్టంగా ప్రకటించారు.
అవాకులు–చవాకులు ఆపండి, నిజం మాట్లాడండి
“ప్రజల దృష్టిని మళ్లించేందుకు అబద్ధపు ప్రచారం చేయడం మీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు ప్రజలు మోసపోవడం లేదు. ఒంటిమిట్టలో జరుగుతున్న అవినీతి, భూకబ్జాలు, అక్రమ కట్టడాలు అన్నీ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఆ నిజం బయటకు వచ్చే భయం మీలో ఉండటంతో ప్రతిపక్షాలపై మట్టి చల్లే ప్రయత్నం చేస్తున్నారు” అని మండల టిడిపి నాయకులు ధ్వజమెత్తారు.
టిడిపి తుది హెచ్చరిక
“ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు ఇక సహించము. ఒకవేళ ఈ విధంగానే అబద్ధపు ఆరోపణలు కొనసాగిస్తే, ప్రజల సమక్షంలో మీ అక్రమాలను ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తాము. భవిష్యత్తులో మీ వ్యాఖ్యలే మీకు అడ్డుకట్ట వేస్తాయి. మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నాము” అని మండల టిడిపి నాయకులు స్పష్టం చేశారు.

2,844 Views

You may also like

Leave a Comment