
కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 09:
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఉభయ పార్లమెంటు సభల్లోని 36 మంది సభ్యులు ఎన్ డి ఏ కూటమికి చెందిన అభ్యర్థికి మద్దతు గా ఓటింగ్ చేయనున్నారని వీరి పరిస్థితి చూస్తే గల్లీలో “సై” రాష్ట్రంలో “నై”ఢిల్లీలో “భాయ్ “అనేలా ఉందని ప్రముఖ సంఘ సేవకులు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ ఎద్దేవా చేశారు.బుధ వారం కడప లోని తన కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నుండి టిడిపి, వైసిపి,జనసేన పార్టీలు విడ్డూరంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న ఎన్డీఏ కూటమి లో 2014 ఎన్నికల్లో టిడిపి,జనసేన పార్టీలు పొత్తుతోకలిసి పోటీ చేయగా, వైసిపి ఒంటరిగా పోటీ చేసిందని చెప్పారు అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వం లో ప్రభుత్వం ఏర్పడగా, చంద్రబా బు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు
అప్పటినుండి మొదలైన రాజకీయ క్రీడ గల్లీలో సై రాష్ట్రంలో నై ఢిల్లీలో భాయ్ బంధం ఇప్పటివరకు కొనసాగుతోందని చెప్పారు.నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఉభయ పార్లమెంటు సభ్యులు 36 మంది మద్దతు ఇస్తూనే ఉన్నారని అన్నారు వక్ఫ్ సవరణ బిల్లు- 2025 ఒక బిల్లుకు తప్ప ఈ 11 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రతిపాదించిన ప్రతి బిల్లుకు బేషరతుగా వైసిపి మద్దతిస్తుండగా, టిడిపి ఎన్డీఏ కూటమిలో లేని సమయంలోకూడ ఈ 11 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతు పలుకు తుందున్నారు బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం వీరి పంథా లో ఎటువంటి మార్పు ఉండదని జోస్యం చెప్పారు.
ఇటువంటి సమయంలో కేవలం ఢిల్లీలోనే భాయిగా ఉండటం దేనికని ప్రశ్నించారు.గల్లీలో సై రాష్ట్రంలో నై ముసుగు తొలగించాలని డిమాండ్ చేశారు పేరుకే మా పార్టీలు మేమంతా పిల్ల బిజెపిలని బహిరంగంగా ప్రకటించుకొండని హితవు పలికారు
2019 ఎన్నికల్లో టిడిపి,2014, 2024 ఎన్నికల్లో వైసిపి, బిజెపికి వ్యతిరేకంగా పోటీ చేసి, ఆయా కాలాలలో కూడ బిజెపికి అను కూలంగా మద్దతు పలికా యని, నేటికీ పలుకు తున్నాయని మండి పడ్డారు బిజెపిని వ్యతిరేకిస్తూ, బిజెపికి మద్దతు పలికే రాజకీయ పార్టీలలో ఉన్న వారు ఆలోచిం చాలని సూచించారు పిల్ల బిజెపిలలో కొనసాగ టమా !లేదా నేరుగా బిజెపిలో చేరటమా?
ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని ధ్వజమెత్తారు