Vrm media ఖమ్మం ప్రతినిధి

ఈరోజు ఖమ్మం లకారం మినీ ట్యాంక్ బండ్ పారడైజ్ నందు నవ్వే జీవన కళా కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమం తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవక్ మరికంటి వెంకట్, యోగా సైన్స్ ను కేజీ నుంచి పీజీ వరకు దేశవ్యాప్తంగా పాఠ్యాంశంగా చేర్చాలని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన అడ్వకేట్ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి 8:00 వరకు జరిగింది ఈ కార్యక్రమంలో నవ్వు యోగ జీవన విధానంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే ఒత్తిడి నుంచి ఉపశమనం కలగటం ద్వారా ఆనందంగా మహదానందంగా జీవించడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చు అని ఇది దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని దీని అందరు సాధన చేయాలి అని తెలియజేశారు 12 అక్టోబర్ 2025న ఖమ్మం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో జరగబోయే లాప్టర్ యోగ జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా వేలాదిమందికి హాజరుకావాలని ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లాఫ్టర్ యోగ గురువులు, సంస్థలు తెలంగాణ ఆంధ్ర నుంచి మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని ఈ కార్యక్రమంలో 2026 క్యాలెండర్ జీవనానంద డైరీ ఇంకా ఇతర పుస్తకాల ఆవిష్కరణ లు ఉంటాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీధర్, రెడ్డి ,గారు రాము ,గారు ఇంకా తదితరులు పాల్గొన్నారు