Home ఆంధ్రప్రదేశ్ యువతకు నేతాజీ సుభాష్ ఆదర్శప్రాయుడు కావాలి:జాతీయ కార్యదర్శి దేవరాజు

యువతకు నేతాజీ సుభాష్ ఆదర్శప్రాయుడు కావాలి:జాతీయ కార్యదర్శి దేవరాజు

by VRM Media
0 comments

కడప VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 12:

కడప జిల్లా భారతదేశంలో ఉన్న యువత ఎక్కువమంది విప్లవ కారుడు చేగువేరా విధానాలను అనుసరిస్తున్నారని కానీ దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన సుభాష్ చంద్రబోస్ ఒక ఆదర్శవంతుడు యువతకు కావాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ ప్రధాన కార్య దర్శి జి దేవరాజ్ పిలుపునిచ్చారు.
అఖిల భారత విద్యార్థి బ్లాక్ 9వ జాతీయ మహాసభలు కడప నగర వేదికగా శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహావీర్ సర్కిల్ నుండి ఎర్రముక్కపల్లి సంధ్యా సర్కిల్ మీదుగా జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వచ్చి, జిల్లా పరిషత్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో విద్యార్థులు ఉద్దేశించి దేవరాజన్ మాట్లాడుతూ.
దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను విద్యార్థులకు అంగడి సరుకుల మార్చిందని, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ విధానంలో కొనసాగుతుందని దీనివల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుందని వారు విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని, ప్రతి ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తానని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను విద్యార్థులను నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలువున మోసం చేస్తుందని వారు వాపోయా రు.అనంతరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ విభజన హామీలలో భాగంగా కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీని ఇప్పటికి అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందాన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు తెలిపారు. విద్యార్థులు రాబోవు రోజుల్లో విద్య, ఉపాధి కోసం పోరాటలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
అనంతరం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సుందర రామరాజు మాట్లాడుతూ.
రాష్ట్రంలోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పక్కన పెట్టి, సంవత్సరం పాలనలో ఏదో పెద్ద ప్రగతి సాధించినట్లు వేడుకలు హాస్యాస్పదమని, కూటమి సర్కార్ పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు చదివే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం సిగ్గుచేటని, వెంటనే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలు కొనసాగేలా లేకుంటే ఆందోళనలను త్రివతరం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ నాయకులు అఖిల భారత విద్యార్థి బ్లాక్ జాతీయ అధ్యక్షుడు డాలర్, జయవర్ధన్, తేజ్ దీప రెడ్డి ,రాజు గొల్లపల్లి ,రాజ శేఖర్ గౌడ్ పాపిరెడ్డిపల్లి పృద్వి సగిలి రాజేంద్రప్రసాద్ పోతులయ్య మరియు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు

2,846 Views

You may also like

Leave a Comment