Home ఆంధ్రప్రదేశ్ వెలుగుపల్లి లో వైద్య శిబిరం ఏర్పాటుడాక్టర్ ప్రవీణ్ కుమార్

వెలుగుపల్లి లో వైద్య శిబిరం ఏర్పాటుడాక్టర్ ప్రవీణ్ కుమార్

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 15

సోమశిల వెనుక జలాలు నీటిమట్టం పెన్నా నదిలో పడడంతో సిద్ధవటం మండలంలోని వెలుగు పల్లి గ్రామంలోని పంట పొలాల్లో పెన్నా నీరు నిలువ చేరడంతో దోమలు వ్యాప్తి చెంది గ్రామంలో కొంతమందికి జ్వరాలు సోకినట్టు సమాచారం రావడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ వాతావరణం మార్పుల వల్ల అధిక వర్షాల కారణంగా పెన్నా నదికి భారీగా జలాశయాలు రావడంతో సోమశిల బ్యాక్ వాటర్ పంట పొలాల్లోకి రావడంతో దోమలు వ్యాప్తి చెంది కొంతమందికి గ్రామంలో సీజన్ వ్యాధులు సోకినట్లు ఫిర్యాదులు రావడంతో కడప డి ఎం హెచ్ ఓ నాగరాజు ఆదేశాలతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించామని మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలు నిర్ధారణ కోసం 16 మందికి రక్త పూతలు సేకరించగా అందరికీ నెగిటివ్ వచ్చాయని గ్రామంలో పూర్తిగా జ్వరాలు తగ్గేంతవరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందని ఎవరు కూడా ఆందోళన చెందవద్దని వైద్య సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారనిపారిశుద్ధం కొన్నిచోట్ల ఉన్నట్లు గుర్తించామని పంచాయతీ సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా తొలగింపు చేపట్టి బ్లీచింగ్ పిచికారి చేయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ, లక్ష్మీ నరసమ్మ, సూపర్వైజర్, మౌలాలి, ఎమ్మెల్సీ హెచ్ పి లోకేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ గట్టుపల్లి వెంకటసుబ్బయ్యi ఆరోగ్య కార్యకర్త అంజనమ్మ, శారద, ఆశ వర్కర్లు కళావతి, పద్మజ, ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు

2,843 Views

You may also like

Leave a Comment