

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట సెప్టెంబర్ 16
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్టమంగళవారం 16 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమస్త వారు ఒంటిమిట్ట ప్రజలను ఉద్దేశించి హెచ్ఐవి గురించి వివరించారు.
మన దేశం రాష్ట్రం హెచ్ఐవి నియంత్రణలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ హెచ్ఐవి ఇంకా పూర్తిగా నిర్మూలించబడలేదు మరియు మధ్యలో ఉందని మనం గుర్తుంచుకోవాలి.
మాదకద్ర వేల అలవాటు మరియు లైంగిక చర్యతో కండోమ్ వాడకపోవడం ఇందుకోసం మన భావితరాలు హెచ్ఐవి బారిన పడకుండా రక్షించుకోవాలంటే, మరొకసారి హెచ్ఐవి గురించి న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరియు చర్చించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
అంతేకాదు హెచ్ఐవి వ్యాప్తిని పూర్తిగా నిర్మించాలంటే వ్యాధి సోకిన వ్యక్తులకు వివక్ష లేని వాతావరణం కల్పించడం ద్వారా మరియు సమాన హక్కులు ఉంటాయని గుర్తించడం ద్వారా మాత్రమే వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి తీసుకునే చర్యలు సఫలం అవుతాయని మనం గుర్తుంచుకోవాలి.
ఇంధుకు మన భారత ప్రభుత్వం హెచ్ఐవి మరియు ఎయిడ్స్( నివారణ మరియు నియంత్రణ) చట్టం 2017 ద్వారా హెచ్ఐవి సోకిన వారికి కూడా సమాన హక్కులు కల్పిస్తుంది మరియు విద్య ఉద్యోగం ఉపాధి మరియు వైద్య అవసరాలలో విపక్ష నివారణ చర్యలతో పాటు ఉల్లంఘించిన వారికి శిక్షలు కూడా విధిస్తుంది.
ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో రెండు నెలలపాటు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందులో యువతతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ భావన రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమస్త వారు మరియు సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి. ఆశ వర్కర్లు. ఏఎన్ఎంలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.