
కడప VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 16:
కడప జిల్లా పర్యాటక పితామహులు, దక్షిణ భారత పర్యాటక సంస్థ జాతీయ అధ్య క్షులు సిద్ధవటం సీతారా మయ్య ఆశయ సాధనకు కృషి చేస్తానని ప్రముఖ సాహితీవేత్త, సంస్థ గౌరవ అధ్యక్షులు విద్వాన్ గానుగ పెంట హనుమంత రావు అన్నారు.మంగ్ల వారం కడపలోని మొల్ల సాహితీ పీఠం కార్యాలయంలో హనుమంత రావు 79వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ” సీతా” బ్యానర్ ను ఆవిష్కరిం చారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ఒక పక్క సాహితీ రంగా న్ని,మరో పక్క పర్యాటక రంగానికి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తా మని చెప్పారు.కడపకు తొలి జిల్లా కేంద్రంగా సిద్ధవటం ఉండేదన్నారు. ఈనెల 27 న జరుగు పర్యాటక దినోత్సవాన్ని సిద్ధవటం కోటలో ఘనంగా నిర్వహించాలని కోరారు. బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగ మూర్తి, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ జి ఎన్ ఆర్ జువెలర్స్ అధినేత గోవిందు నాగరాజు, ఖాదర్ భాషా లు మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రాచీన శిల్పాలు, వారసత్వ సంపద ఉందన్నారు.ప్రతి ఒక్కరూ పర్యాటక అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంద న్నారు.ప్రచారానికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పా రు.ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షుడు జ్యోతి జార్జి,ప్రధాన కార్యదర్శి మురికి నాటి శ్రీనివా సులు,నగేష్, మనోజ్ కుమార్, రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు