

కడప: VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 16:
ఆ కాలం లోనే అనేక మంది విమర్శకుల మధ్య శ్రీకంఠ మల్లేశ్వర స్వామి అనుగ్రహం తో తెలుగులో మొట్ట మొదటిసారిగా రామాయణాన్ని రచించిన మొల్ల మాంబ కీర్తిని దేశ విదేశాల్లో వ్యాపింప చేసిన ఘనత విద్వాన్ డాక్టర్ గానుగ పెంట హనుమం తరావుకే దక్కుతుందని వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికా ర్జున రెడ్డి అన్నారు. హను మంత రావు డెబ్భై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా మంగళ వారం కడప లోని ఆయన స్వగృ హంలో వైయస్సార్ జిల్లా రచ యితల సంఘం ఆధ్వర్యంలో, గానుగపెంట శిష్యులు, బంధు వులు, అభిమా నులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యక్షులుగా జిల్లా రచయితల సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న గానుగపెంట హనుమంతరావు 2000 లో భాగ్యలక్ష్మి పౌండేషన్, 2004లో మొల్ల సాహిత్య పీఠం ఏర్పాటుచేసి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, జిల్లాలో వేలాది మంది కవులకు, కళాకారులకు సన్మానం చేసిన ఘనత ఆయన దేనని చెప్పా రు.పదవీ విరమణ తర్వాత ఒక మనిషి సమాజానికి ఎంత సేవ చేయగలడో చేసి నిరూపించిన మహోన్నత వ్యక్తి హనుమం తరావని కొనియాడారు. డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి ప్రసం గిస్తూ కవిగా, రచయితగా ఎన్నో గ్రంథాలు రాసిన హనుమంత రావు రెండుసార్లు ఉత్తమ ఉపా ధ్యాయ పురస్కారాన్ని అందుకు న్నారని, 1990లో భారత రాష్ట్రపతి కే ఆర్ నారాయణ చేతుల మీదుగా పండిత రత్న బిరుదు స్వీకరిం చారని తెలిపారు. ఒక్క బద్వేలు ప్రాంతంలోనే 600 సాహిత్య సభలు పెట్టి, రాష్ట్రం లో,ఇతర ప్రాంతాల్లో దాదాపు 1,000 పైగా సభలు నిర్వహించిన ఏకైక వ్యక్తి జిల్లా వాసి హనుమం తరావు కావడం విశేషమన్నారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ సత్కారాన్ని అందుకున్న ఎన్ఎ. స్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భూమి రెడ్డి రవి కళ్యాణ్ మాట్లాడుతూ హను మంతరావు మొల్ల జన్మస్థలమైన గోపవరం గ్రామం లోనే కాకుండా జిల్లాలో అనేక చోట్ల మొల్ల విగ్రహా లు నెలకొల్పారని తెలియజేస్తూ గత 50 సంవత్సరాల కాలంలో జిల్లాలో ఆయన చేస్తున్న సాహిత్య కృషిని కొనియాడారు. కుమారుడు మనోజ్ మాట్లాడుతూ తన తండ్రిని చూసి గర్వపడుతున్నానని, ఆయన కుమారునిగా పుట్టడం పూర్వజన్మ సుకృతమన్నారు.ఈ కార్యక్రమంలో సుబ్బమ్మ, ప్రముఖ రచయిత జ్యోతి జార్జ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తల లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు నాగరాజు, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు, కోశాధికారి నగేష్, మేకల వెంకటరమణ, సుధాకర్, ఖాదర్ భాష, రాణా ప్రతాప్, అంజి, సూర్యుడు, హరి, వేద పండితుడు సుదీర్ శర్మ పాల్గొన్నారు.