ఏలేశ్వరం,vrm media న్యూస్, 24:-ప్రతినిధి,ప్రిన్స్, సెప్టెంబర్, 19:-

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్ధ్ నారి సశక్త్ పరివార్ అభయాన్ కార్యక్రమం రెండవ రోజు ఏలేశ్వరం మండలంలో జె అన్నవరం గ్రామంలో 120 మంది మహిళలకు వివిధ రకాలైన ఆరోగ్య సేవలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. వైద్యులు కే సంతోష్ వినీల్, సిహెచ్ పవన్ కుమార్ వైద్య సేవలు అందించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ సూర్య కుమారి ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు వివిధ రకాల పౌష్టిక ఆహారంలకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేసి మహిళలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు తమ ఆరోగ్య సమస్యలను బయటకు చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ రెండవ తేదీ వరకు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించునట్లు ఆయన తెలిపారు. కావున గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఆరోగ్య సమస్యలను వైద్య లకు తెలియజేయవలసిందిగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాజంకి కన్నారావు, కూటమి నాయకులు అలర్క్ రాజు, కాలారి శ్రీను, ఎంపీటీసీ కాలారి సత్యనారాయణ, కార్యదర్శి కారు వెంకటరమణ,వైద్య శాఖ సిబ్బంది సిహెచ్ఓ పీ మాణిక్య కుమారి, హెల్త్ సూపర్వైజర్ టీ వీరన్న, మహిళ ఆరోగ్య పర్యవేక్షకురాలు కే దైవ కృప, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్ పిలు, ఆశాలు తదితరులున్నారు.