

విశాఖపట్నంVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 20
విశాఖపట్నంలోని బిజెపి కార్యాలయంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నూతనంగా నియామకం అయిన సందర్భంగా పోతుగుంట రమేష్ నాయుడు కలిసి సన్మానించడం జరిగింది. సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ మాట్లాడుతూ ఎబివిపి కార్యకర్తగా విద్యార్థి రాజకీయాల నుంచి నిబద్ధతతో పనిచేసిన కార్యకర్త రమేష్ నాయుడు అన్నారు.క్రమశిక్షణతో పార్టీని నమ్మి పనిచేసిన సాధారణ కార్యకర్తకు సైతం భారతీయ జనతా పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది అన్నారు. సాధారణ కార్యకర్త సైతం పార్టీ ఉన్నత పదవులను ఆశించి పొందగలిగే ఏకైక పార్టీ ఈ దేశంలో కేవలం బిజెపి మాత్రమే అన్నారు అనీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నియమాన్ని కార్యకర్తలు ఎప్పుడూ నెమరువేసుకోవాలన్నారు. అనంతరం నూతన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మెన్ పోతుగుంట రమేష్ నాయుడు PVN మాధవ్ ను శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ ,పార్టీ పెద్దలు ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తానని శ్రీశైలం దేవస్థాన పరిపాలన,పవిత్రతను చిత్తశుద్ధితో కాపాడుతానని దైవకార్యాన్ని పార్టీ పెద్దలు పెట్టడం ఆనందంగా ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ BJYM నాయకులు ఇప్పిలి మూర్తి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.