Home ఆంధ్రప్రదేశ్ గురజాడ సాహిత్యం ఆధునిక దృక్పథండా తవ్వా వెంకటయ్య

గురజాడ సాహిత్యం ఆధునిక దృక్పథండా తవ్వా వెంకటయ్య

by VRM Media
0 comments

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 22:

కడప కార్చిలర్ నేటి ప్రపంచానికి దీపదారి గురజాడ అప్పారావు అనిఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డా తవ్వా వెంకటయ్య పేర్కొన్నారు.గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకొని సోమవారం కడపలోని కోటిరెడ్డి మహిళా కళాశాలలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలను కళాశాల తెలుగు అధ్యాపకురాలు డా.యం వి యన్ సుధారాణి అధ్యక్షతన ఘనంగా నిర్వహిం చారు ఈ సంద ర్భంగా డా. తవ్వా వెంకటయ్య ప్రధాన వక్తగా మాట్లాడుతూగురజాడ అప్పారావు 1862 లో జన్మించి, 1915లో మరణించారని చెప్పారు.ఆయన మరణించిన 110 సంవత్సరాల తర్వాత కూడా ఆయన రచనలు, ఆలోచనలు సంఘసంస్కరణ దృక్పథంతో నిలిచాయని అన్నారు. కన్యాశు ల్కం, పూర్ణమ్మ నేటి తరానికి ఎంతోఆదర్శప్రాయ మన్నారు. గురజాడ రాసిన దేశభక్తి గేయం ప్రపంచానికి ఆదర్శంగా ఉందన్నారు. సమా జాన్ని పట్టిపీడిస్తున్న బాల్వవి వాహాలు, సతీసహగమ స్త్రీల నిరక్షరాస్యత వంటి వాటిపై గురజాడ అప్పారావు అక్షర యుద్ధం చేశారని తెలిపారు ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డా. వి.సలీం భాష మాట్లాడుతూ గురజాడ కాలాలతో సంబంధం లేకుండా ప్రపంచానికి అవసరమైన సాహితీవేత్త అని, ఆయన అడుగుజాడలే నేటి తరానికి మార్గదర్శకాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ లెక్చరర్ డాక్టర్ షార్జియా బేగం ,పోలిటికల్ సైన్స్ లెక్చరర్ డాక్టర్ పి.వి సు బ్బారెడ్డి ,జి.పి.ఆశాలత , విద్యా ర్థులు పాల్గొన్నారు.

2,829 Views

You may also like

Leave a Comment