Home ఆంధ్రప్రదేశ్ నేడు కీర్తి’ పురస్కారం అందుకోనున్న లోకనాథంఆచార్య మూల మల్లికార్జున రెడ్డి

నేడు కీర్తి’ పురస్కారం అందుకోనున్న లోకనాథంఆచార్య మూల మల్లికార్జున రెడ్డి

by VRM Media
0 comments

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 22:

కడప కల్చరల్ విద్యాశాఖ అధికా రిగా పదవీ విరమణ చేసి 60 సంవత్సరాల తర్వాత పద్యం పై మక్కువ పెంచు కొని గర్భ, బంధ కవిత్వాలను రాస్తున్న’ విద్యాతప స్వి’ మామిళ్ళ వెంకట రంగయ్య గారి లోకనాథం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యా లయం, హైదరాబాదు వారు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ‘కీర్తి’ పురస్కా రాన్ని సెప్టెంబర్ 23వ తేదీ హైదరా బాదులో తీసుకోనున్న సందర్భంగా ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి అభినందనలు తెలియజేశారు. సోమవారం వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం, సనాతన ధర్మ సామూహిక ప్రార్ధనా దేవాలయాల సంస్థ(వ్యవస్థాపకులు,ఉపాధ్యక్షులు కాల్వ సోమ కళానాథరెడ్డి) సంయు క్త ఆధ్వర్యంలో సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఆయన ను ఘనంగా సత్కరించారు. మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ శతకాలు, పద్య కావ్యాలు దాదాపు 50 కి పైగా రాసిన లోకనాథం ఒంటిమిట్ట కోదండ రాముని పైన భక్తితో శ్రీ ఒంటిమిట్ట కోదండ రామస్వామి చరిత్ర, శ్రీ కోదండ రామ శతకం, శ్రీరామచంద్ర శతకం, శ్రీ లోకనాథ రామాయణం, శ్రీ రామయా గర్భ కవిత్వం, శ్రీరామ భద్రోదాహరణ కావ్యం, శ్రీరామ పూజా విధానం, శ్రీరామ భజ నామృతం మొదలైన గ్రంథాలు వెలువరించడం ఆయనకు శ్రీరాముని పై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనమన్నారు.సోమ కళానాథరెడ్డి ప్రసంగిస్తూ మా సంస్థకు చైర్మన్ గా ఉన్న లోకనాథం ఆధ్యాత్మిక,సాహిత్య రంగాలకు చేసిన కృషిని గుర్తించి ఒక విశ్వవిద్యాలయం’ కీర్తి ‘పురస్కా రాన్ని అందజేయడం గర్వకార ణమని చెప్పారు.విద్యారంగం లో ఎన్నో సంస్కరణలు చేసి పదవీ విరమణ తర్వాత కవిత్వం పై దృష్టి సారించి గొప్ప కవిగా గుర్తింపు సంపాదించుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి, కార్య వర్గ సభ్యులు డాక్టర్ జీవి సాయి, డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి, కోడూరు సుమన శ్రీ,సనాతన ధర్మ సామూహిక ప్రార్థనా దేవాలయాల సంస్థ వైస్ చైర్మన్ పసుపులేటి శంకర్, దిలీప్ కుమార్ జైన్, గొరిగ వెంకటేశ్వర్లు, ఈశ్వర రెడ్డి,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

2,855 Views

You may also like

Leave a Comment