Home ఆంధ్రప్రదేశ్ టీటీడీ కళ్యాణ మండపాన్ని పునః ప్రారంభించిన డాక్టర్ మట్టా

టీటీడీ కళ్యాణ మండపాన్ని పునః ప్రారంభించిన డాక్టర్ మట్టా

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు మెయిన్ రోడ్ లో 30 సంవత్సరాల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న టిటిడి కళ్యాణ మండపాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సోమవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి కుటుంబాల శుభ కార్యాలు తక్కువ ధరతో నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందని ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నారు. టీటీడీ ఫంక్షన్ హల్ బాధ్యత లు నిర్వహిస్తున్న ఏనుముల రాము యాదవ్, రుక్మిణి యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నిర్వాహకులు పునః ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ,ఆర్యవైశ్య ఖమ్మం జిల్లా మహాసభ అధ్యక్షులు పసుమర్తి చందర్రావు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, కె.వి.ఆర్, తక్కెళ్ళపాటి దుర్గాప్రసాద్ ,పెద్ద బోయిన శ్రీనివాసరావు ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆలకుంట నరసింహారావు, నాయకులు దామల సురేష్ బాబు ,మూకర విజయరావు, నోటి కృష్ణారెడ్డి, భూక్య శివకుమార్ నాయక్,బైర్ల కాంతారావు, దామాల రాజు, మేకల రవికుమార్, వేము దినాకర్ రావు, చెంపసాల వెంకటకృష్ణ, మట్ట రామకృష్ణ, క్లాస్ వన్ కాంట్రాక్టర్ హానిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో కల్లూరు AMC చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సీనియర్ నాయకులు ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు, సీనియర్ నాయకులు లక్కినేని కృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహ రావు, కల్లూరు పట్టణ,మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

2,838 Views

You may also like

Leave a Comment