Home ఆంధ్రప్రదేశ్ Lగిరిజన సమస్యల పరిష్కారంపై దృష్టి

Lగిరిజన సమస్యల పరిష్కారంపై దృష్టి

by VRM Media
0 comments

ప్రత్తిపాడు,వి.ర్.ఎం.న్యూస్. 24,ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 23:-

నియోజకవర్గంలో గిరిజన ప్రాంత ప్రజల సమస్యల పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని ఎంఎల్ఎ వరుపుల సత్యప్రభ కోరారు. సోమవారం శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించిన అంశాలను స్థానిక మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. నియోజకవర్గంలో 58 గిరిజన గ్రామాలు ఉన్నాయని, అవి ఇటు మైదానం, అటు ఏజెన్సీ పరిధిలో లేకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. విద్యా, వైద్య సౌకర్యాలు, తాగునీరు, రహదారులు, కుల ధ్రువీకరణ పత్రాలు వంటి సదుపాయాలు కలగక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసిపి పాలనలో తప్పుడు తీర్మానాలు చేసి గిరిజనుల హక్కులను హరించారన్నారు. 58 గిరిజన గ్రామాలను ఐటిడిఎ పరిధిలోకి చేర్చాలని కోరారు. పెద్దమల్లాపురం కేంద్రంగా ఒక కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

2,841 Views

You may also like

Leave a Comment