Home ఆంధ్రప్రదేశ్ 54 కోట్లతో మాచుపల్లి, ఖాదర్ బంగ్లా పెన్నా నదిపై వంతెన నిర్మాణ కొరకు ప్రతిపాదనలుఆర్ అండ్ బి ఏ ఈ, రామాంజనేయులు

54 కోట్లతో మాచుపల్లి, ఖాదర్ బంగ్లా పెన్నా నదిపై వంతెన నిర్మాణ కొరకు ప్రతిపాదనలుఆర్ అండ్ బి ఏ ఈ, రామాంజనేయులు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 23

సిద్ధవటం మండలం మాచుపల్లి ఖాదర్ బంగ్లా పెన్నా నదిపై నూతన వంతెన నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఆర్ అండ్ బి ఏ ఈ రామాంజనేయులు తెలిపారు సిద్ధవటం మండలంలోని మాచుపల్లి పెన్నా నది వద్ద మంగళవారం ఆర్ అండ్ బి ఏ ఈ రామాంజనేయులు మాట్లాడుతూ వంతెన నిర్మాణంపనుల కొరకై రాష్ట్ర ప్రభుత్వానికి 54 కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న రాజంపేట పర్యటన సందర్భంగా బ్రిడ్జి నిర్మాణ కొరకై మాచుపల్లి గ్రామ నివాసి మల్లు వెంకట సుబ్బారెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఉన్నత అధికారులు ఆదేశాలతో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వానికి 54, కోట్లతో ప్రతిపాదన పంపుతున్నామని తెలిపారు టిడిపి నేత మల్లు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ సిద్ధవటం మండల ప్రజల చిరకాలకోరిక నెరవేర్చమని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆగస్టు 1న గ్రీవెన్స్l లో ఫిర్యాదు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి అర్జీ ఇచ్చిన 23 రోజులకు అధికారులను పంపించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మండల ప్రజలకు చెప్పిన వాగ్దానం త్వరలో అమలైతుందని సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో , మల్లు చిన్న పిచ్చిరెడ్డి, అన్నా రెడ్డి ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు

2,840 Views

You may also like

Leave a Comment