Home ఆంధ్రప్రదేశ్ చిన శంకర్లపూడిలో బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

చిన శంకర్లపూడిలో బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

by VRM Media
0 comments

ప్రత్తిపాడు,వి.ఆర్.ఎం.న్యూస్ 24,ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 29:-

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చిన శంకర్లపూడి గ్రామంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా టిడిపి నాయకులు మిరియాల శ్రీను,మిరియాల వెంకటరమణ మరియు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హాజరై ఉదయం నుండి మహిళలు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో చేపట్టిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు.దుర్గాదేవి ఆలయం నుండి భాజా భజంత్రీలతో,తీన్మార్ డప్పులతో,వేదమంత్రాలతో,దుర్గమ్మ అమ్మవారి శరణు ఘోషతో,మహిళల కోలాటాల నడుమ భక్తి శ్రద్దలతో మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించారు.భక్తి శ్రద్దలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకధాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న మహిళలు ఊరేగింపుగా వెళ్లడంతో చిన శంకర్లపూడి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించికుంది.ఈ సందర్భంగా నాయకులు మిరియాల శ్రీను,మిరియాల వెంకటరమణ మాట్లాడుతూ సుఖ సంతోషాలతో,శాంతి సౌభాగ్యాలతో,సిరి సంపదలతో తులతూగేలాగా ఆ దుర్గమ్మ ఆశీస్సులు తమ గ్రామంపై ఉండాలని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు.తమ పిలుపు మేరకు వచ్చిన ఎమ్మెల్యే సత్యప్రభకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్తర కంచి సర్పంచ్ మంతెన వెంకటరమణ,అడ్డాల త్రిమూర్తులు, రామిశెట్టి శ్రీనివాస్,బండి సుబ్బారావు,గవిరెడ్డి మాణిక్యం,మండా బాబ్జి,దువ్వా గంగబాబు,బద్దేటి శ్రీను,బద్దేటి ముసిలి,కర్రి శ్రీరామ్ దుర్గ,పసుపులేటి అప్పారావు,రావూరి నాగేశ్వరరావు,ఆలయ కమిటీ సభ్యులు చిన్న శంకర్లపూడి గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు

2,821 Views

You may also like

Leave a Comment