Home ఆంధ్రప్రదేశ్ మాచుపల్లి బస్టాండ్‌ వద్ద మహిళలకు పబ్లిక్ టాయిలెట్ సౌకర్యం పరిశీలన

మాచుపల్లి బస్టాండ్‌ వద్ద మహిళలకు పబ్లిక్ టాయిలెట్ సౌకర్యం పరిశీలన

by VRM Media
0 comments

కడప జిల్లా VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ అక్టోబర్ 5

కడప పట్టణం, సిద్ధవటం మండలం
కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధవి రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మాచుపల్లి బస్టాండ్‌ వద్ద మహిళలకు పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు కోసం స్థలాన్ని పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు, మసాపేట శివ గారు, ఆటో యూనియన్ సభ్యులు కలిసి ఈరోజు పరిశీలించారు.
ప్రతిరోజు మాచుపల్లి బస్టాండ్‌ నుండి సిద్ధవటం వరకు, అలాగే వయలింగంపల్లి, మాచుపల్లి, టక్కోలు గ్రామాల నుండి అనేక మంది మహిళలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో వారికి అవసరమైన మరుగుదొడ్డి సదుపాయం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు.
రేపు మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాము అని పార్లమెంట్ కార్యదర్శి నాగ ముని రెడ్డి తెలిపారు

2,843 Views

You may also like

Leave a Comment