VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవి బాబు అక్టోబర్ 6
మండలంలోని మంగంపేట వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని మలకాటుపల్లి కి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు శివారెడ్డి సతీమణి రేణుక మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని మలకాటి పల్లికి చెందిన శివరామకృష్ణారెడ్డి, భార్య రేణుక, వారి ఇద్దరి కుమార్తెలు నందలూరు లోని నల్లతుమ్మాలపల్లికి కారులో వెళ్తుండగా మంగపేట వద్దకు రాగానే లారీ ఢీకొట్టడంతో కారులోని రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులను చికిత్స రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.