


దేవీపట్నం ప్రెస్ నోట్:( VRM Media)దుర్గా ప్రసాద్
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో గల ఇందుకూరుపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఆటో,మ్యాజిక్,టాక్సీ డ్రైవర్లకు
15వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంలో భాగంగా రాష్ట్రమంతా ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయలు నేరుగా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో సోమవారం శ్రీశక్తి భవన్ వద్ద ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు ఆధ్వర్యంలో దేవిపట్నం కూటమి నాయకులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అలానే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకు ఆటో సోదరులు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తిపరిచారు ఈ సర్దార్పంగా వారు మాట్లాడుతూ కుటుంబ జీవన ఆర్థిక ఇబ్బందుల్లో కష్టతరంగా మారిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నగదు సాయం చేసి కుటుంబ పోషణకు ఎంతో ఉపయోగంగా అందించడం జరిగిందన్నారు.రాయుడు మాట్లాడుతూ ఇంకా కొంతమంది ఆటో సోదరులకు చలానాలు పెండింగ్ ఉండటం వలన,లైసెన్స్ లేకపోవటం,ఆటోకి సంబంధించిన పేపర్స్ సరిగ్గా లేకపోవటం వలన పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వారికీ నేరుగా మన ఆవరణలో వున్నా సచివాలయాల్లో కరప్షన్ చేసుకుని అప్లై చేసుకునే అవకాశాన్ని ఇంచ్చిందని గమనించి ఇంకా పెండింగ్ లో వున్నా ఆటో సోదరులు నమోదు చేసుకోవాలని ఎవరు అధైర్య పడవద్దని తెలియచేసారు.కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు,మాజీ మండల అధ్యక్షులు,సొసైటీ అధ్యక్షులు,మండలం టిడిపి నాయకులు మరియు జిల్లా నాయకులు పాల్గొనగ జనసేనపార్టీ అధ్యక్షులు చారపు వెంకటరాయుడు,ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు,సీనియర్ నాయకులు కట్టమూరి వీరబాబు,డివిటి అంజి, మట్టా సందీప్ నాయుడు,కోండ్ల సురేష్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గాప్రసాద్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.