ఒంటిమిట్ట మండలంలోని నరవకాటిపల్లి, అరుంధతికాలనీ లోని అంగన్వాడీ స్కూల్ ను గురువారం నాడు ఎంపీడీఓ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు.పిల్లల హాజరు రికార్థులను పరిశీలించారు. అంగన్వాడీ స్కూల్ టీచర్ వెంకటసుబ్బమ్మ ను స్కూల్ కు ఎంతమంది పిల్లలు హాజరుతున్నారు, పిల్లలకు భోజనం, పౌష్టిక ఆహారం సకాలంలో ఇస్తున్నారా, గర్భవతులకు రేషన్, గుడ్లు సకాలంలో ఇస్తున్నార అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్, ఆయా ఉన్నారు.